Palvancha: పసికందు తలను పీక్కుతిన్న కుక్కలు.. అసలేం జరిగింది?

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని బొల్లోరు గూడెంలో దారుణం. పసికందు తలను వీధి కుక్కలు పీక్కుతింటుండగా చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 13 May 2026 10:33 AM IST
Palvancha
X

Palvancha: పసికందు తలను పీక్కుతిన్న కుక్కలు.. అసలేం జరిగింది?

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బొల్లోరు గూడెంలో తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఓ పసికందు తల భాగాన్ని వీధి కుక్కలు పీక్కుతింటుండగా స్థానికులు గమనించారు. ఈ దృశ్యం చూసి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే కుక్కలను తరిమివేయడంతో అవి అక్కడి నుండి పరారయ్యాయి. ఈ దారుణ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

వెంటనే పోలీసులకు, స్థానిక కార్పొరేటర్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పసికందు తల భాగాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పసికందు తల భాగం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ఇక్కడ పడేశారు? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

Next Story