Khammam: ఖమ్మం జిల్లాలో పులిగొండ నారసింహుడి కళ్యాణ సంబరం.. పోటెత్తిన భక్తులు!

Khammam: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లఒడ్డు మరియు వైరా మండలం గొల్లపూడి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది.

SHAIK RAFI, WYRA
Published on: 2 May 2026 11:06 AM IST
Khammam
X

Khammam: ఖమ్మం జిల్లాలో పులిగొండ నారసింహుడి కళ్యాణ సంబరం.. పోటెత్తిన భక్తులు!

ఖమ్మం జిల్లా: ఏన్కూరు వైరా మండలాల్లో ని గార్లఒడ్డు శ్రీలక్ష్మీనరసింహస్వామి గొల్లపూడి శ్రీ పులిగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు ఆలయ కమిటీ నిర్వాహకులు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జాలాది దొరబాబు దంపతులు పులికొండ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఈఊరి వెంకటేశ్వరరావు ఈవో ప్రసాద్ మేనేజర్ శ్రీనివాసరావు కమిటీ నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు.

SHAIK RAFI, WYRA

SHAIK RAFI, WYRA

Next Story