Kothagudem: నేరాల నియంత్రణలో టెక్నాలజీని సమర్థంగా వాడాలి: ఎస్పీ రోహిత్ రాజు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో టెక్ టీమ్ ఆపరేటర్స్, సైబర్ వారియర్స్‌కు వెబ్ అప్లికేషన్లపై ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది.
Kothagudem: నేరాల నియంత్రణలో టెక్నాలజీని సమర్థంగా వాడాలి: ఎస్పీ రోహిత్ రాజు!
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నందు గురువారం నాడు టెక్ టీమ్ ఆపరేటర్స్, సైబర్ వారియర్స్ కు వివిధ పోలీసింగ్ వెబ్ అప్లికేషన్ల పై ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ హాజరై శిక్షణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సీసీటీఎన్‌ఎస్ 2.0, క్రై-మాక్, ఐసీజేఎస్, టీఎస్-కాప్స్, డయల్-100, ఎఫ్‌ఆర్‌ఎస్, ఎంటర్‌ప్రైజ్ చెక్, ఈ-సాక్ష్య, సైక్యాప్స్, డోపామ్స్, ఎన్‌సీఆర్‌పీ, ఐరాడ్, సమన్వయ పోర్టల్, సీఈఐఆర్, దర్పణ్, సహయోగ్, వాత్సల్య, జిఆర్ఎం, ఎంఆర్ఎఫ్, నాట్ గ్రిడ్, గాండీవ తదితర వెబ్ అప్లికేషన్ల పై సిబ్బందికి శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపు, సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ సాక్ష్యాల సేకరణలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని టెక్ టీమ్ ఆపరేటర్లు, సైబర్ వారియర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐటి కోర్ సీఐ రాము, సైబర్ సెల్ సీఐ జితేందర్, సిఐలు రమాకాంత్, లక్ష్మి, పోలీసు అధికారులు, టేక్ టీం ఆపరేటర్స్, సైబర్ వారియర్స్ , సిబ్బంది పాల్గొన్నారు.




