Kothagudem: కొత్తగూడెం కొత్త డీఈఓగా వాసంతి

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన డీఈఓగా శ్రీమతి డి. వాసంతి బాధ్యతల స్వీకరణ.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 2 Jun 2026 5:09 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం కొత్త డీఈఓగా వాసంతి

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO)గా శ్రీమతి డి. వాసంతి గారు మంగళవారం (02-06-2026) బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా విధులలో చేరిన జిల్లా విద్యా శాఖాధికారిణి వాసంతి గారిని జిల్లా విద్యాశాఖా కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీ శంభు ప్రసాద్ మరియు కార్యాలయ సిబ్బంది పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా జిల్లా కలెక్టర్ గారికి మొక్కను అందజేశారు. జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగుదల, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ఫలితాల పెంపు, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు ప్రత్యేక కృషి చేస్తానని శ్రీమతి డి. వాసంతి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story