Burgampahad: బూర్గంపహాడ్‌లో 41 మందిపై బైండోవర్ కేసులు ఎస్సై మేడా ప్రసాద్

Burgampahad: అక్రమ ఇసుక, గోవుల రవాణాకు పాల్పడుతున్న 41 మందిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. సమాచారం ఉంటే తెలపాలని ఎస్సై విజ్ఞప్తి.

G Ravi, Bhadradri
Published on: 17 May 2026 10:15 AM IST
Burgampahad
X

Burgampahad: బూర్గంపహాడ్‌లో 41 మందిపై బైండోవర్ కేసులు ఎస్సై మేడా ప్రసాద్

బూర్గంపహాడ్: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, అక్రమంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ హెచ్చరించారు. మండల వ్యాప్తంగా ఆక్రమ ఇసుక రవాణాతో పాటు అక్రమ గోవుల రవాణా కు పాల్పడుతున్న 41 మందిపై శనివారం బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని రెండు అక్రమ ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుక తరలిస్తున్న 8 మందిపై బైండోవర్ కేసు నమోదు చేశారు. మరికొంతమందిని సోమవారం బైండోవర్ చేయనున్నట్లు ఎస్సై వెల్లడించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే క్రిమినల్ కేసులతో పాటు బైండోవర్ చేస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవారిని ఉపేక్షించేది లేదు అని ఎస్సై మేడా ప్రసాద్ స్పష్టం చేశారు. అక్రమ రవాణా సమాచారం ఉంటే వెంటనే. పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story