Burgampahad: సారపాక వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ట్రాలీ డ్రైవర్ పరిస్థితి విషమం!

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక మూలమలుపు వద్ద లారీ-ట్రాలీ ఢీ. ట్రాలీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, భద్రాచలం ఆసుపత్రికి తరలింపు.

G Ravi, Bhadradri
Published on: 24 July 2026 2:20 PM IST
Burgampahad
X

Burgampahad: సారపాక వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ట్రాలీ డ్రైవర్ పరిస్థితి విషమం!

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మూలమలుపు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ లారీ ట్రాలీని బలంగా ఢీకొట్టడంతో ట్రాలీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తుండగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story