Sattupalli: సత్తుపల్లి జాతీయ జల మిషన్ సందర్భంగా నీటి పొదుపు ప్రతిజ్ఞ

Sattupalli: సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ. ప్రతి నీటి బొట్టును ఆదా చేయాలని కమిషనర్ పిలుపు. కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన సిబ్బంది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Updated on: 14 July 2026 9:25 PM IST
Sattupalli
X

Sattupalli: సత్తుపల్లి జాతీయ జల మిషన్ సందర్భంగా నీటి పొదుపు ప్రతిజ్ఞ

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా లో జాతీయ జల మిషన్ సందర్భంగా సత్తుపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో చైర్పర్సన్ రెహనా కమల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ కె నరసింహ మాట్లాడుతూ ప్రతి నీటిబొట్టును పొదుపు చేయాలని రానున్న కాలంలో నీరు అందుబాటులో లేక ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని ఇప్పటికే మంచినీరు కొని తాగుతున్నామని నీటిని వృధా చేయకుండా అవసరాల మాటికి వాడుకోవాలన్నారు.

ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణంలో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, ఏ సురేష్ ఆర్ ఐ కే దిలీప్ కుమార్ సుజాత ప్రసాదు డాక్టర్ సిబ్బంది మహిళా సభ్యులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story