Sathupalli: సత్తుపల్లి బొగ్గు రవాణా పనులను పరిశీలించిన బి.కోటేశ్వరరావు

Sathupalli: సత్తుపల్లి జెవిఆర్ ఓపెన్ కాస్ట్ గనిలో రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా పనులను పరిశీలించిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ బి.కోటేశ్వరరావు. కార్మికులకు భరోసా.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 18 July 2026 9:27 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లి బొగ్గు రవాణా పనులను పరిశీలించిన బి.కోటేశ్వరరావు

సత్తుపల్లి: సింగరేణి సత్తుపల్లి ఏరియా జలగం వెంగళరావు ఉపరితల గని నుండి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ కు శైలో బంకర్ ద్వారా రైలు మార్గంపై బొగ్గు రవాణా పనులను సత్తుపల్లి ఏరియా ఐ.ఎన్.టి.యు.సి వైస్ ప్రెసిడెంట్ బి.కోటేశ్వరరావు పరిశీలించారు. రైల్వే సిగ్నల్ స్టేషన్ లో రైళ్ల రాకపోకలు, భోగిలకు బొగ్గు లోడింగ్ విధానాన్ని నేరుగా పరిశీలించారు.

స్టేషన్లో రైళ్ల రాకపోక నియంత్రణ, భద్రతా ప్రమాణాలను రైల్వే శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైళ్లకు బొగ్గు లోడింగ్ రవాణా ప్రక్రియ అడ్డంకులు లేకుండా రైల్వే ఉద్యోగులు సురక్షితమైన వాతావరణంలో విధులు నిర్వహించే విధంగా సింగరేణి అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కోరారు.

రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా సిగ్నలింగ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని కోటేశ్వరరావు కార్మికులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి బ్రాంచ్ సెక్రటరీ మురళీకృష్ణ, బ్రాంచ్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షట్రక్ బాబు, వేణునాథ్, యశ్వంత్ రెడ్డి, జే.వి.ఆర్ సి.హెచ్.పి ఫిట్ సెక్రటరీ నగేష్, రమేష్, ఇక్బాల్, డి.ఎల్.ఆర్ ఇంచార్జ్ సుభాని, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story