Sathupally: పేదలకు మెరుగైన వైద్యం అందించాలి..ఎమ్మెల్యే డాక్టర్ మట్టా!
Sathupally: సత్తుపల్లి నూతన ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. రోగులకు మెరుగైన సేవలు, పోషకాహారం అందించాలని సూచన.
Sathupally: పేదలకు మెరుగైన వైద్యం అందించాలి..ఎమ్మెల్యే డాక్టర్ మట్టా!
Sathupally: - నూతనముగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి లో - సత్తుపల్లి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించినరు.సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆసుపత్రి సూపర్డెంట్ సురేష్ నాయక్ గారితో, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీతో కలిసి గతంలో సింగరేణి ఆధ్వర్యంలో అందించిన ఆసుపత్రి వైద్య పరీక్ష పరికరాలను పరిశీలించారు.
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అన్ని విధాల మెరుగైన వైద్యం అందించాలని, అందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వైద్య శాఖ మంత్రివర్యులు ఆద్వర్యంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు.
ఆసుపత్రిలోని రోగులకు పుష్టికరమైన, పోషక ఆహారం అందించాలని, క్వాలిటీ క్వాంటిటీ పెంచాలని కాంట్రాక్టర్కు మరియు సిబ్బందికి పలు సూచనలు సలహాలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని వారికి వైద్య సహాయకారాలు అందించాలని డాక్టర్స్ కు తెలియజేశారు.
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులను కలుసుకొని , వారితో ప్రత్యేకంగా MLA రాగమయి గారు మాట్లాడటం జరిగింది.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు వైద్య శాఖ మంత్రివర్యులకు సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి గురించి మెరుగైన వైద్య సహాయం కొరకు ఇంకా మరెన్నో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లి త్వరలోనే ఇంకా అభివృద్ధి జరిగేలా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఫయాజ్ అలీ మొరుశెట్టి సాంబశివరావు దేవి శ్రీనివాసరావు బత్తుల భరత్ చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.




