Sathupalli: సత్తుపల్లిలో దొంగల హల్‌చల్ కూల్ డ్రింక్ షాప్‌లో చోరీ యత్నం!
Sathupalli: ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లిలో కూల్ డ్రింక్ షాప్‌లో దొంగల చోరీ యత్నం. సీసీ కెమెరా వైర్లు కట్ చేసి తాళాలు పగలగొట్టేందుకు యత్నించిన దుండగులు.
Sathupalli: సత్తుపల్లిలో దొంగల హల్‌చల్ కూల్ డ్రింక్ షాప్‌లో చోరీ యత్నం!
Sathupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామ శివారులోని ఓ కూల్ డ్రింక్ షాపులో దొంగలు చోరీకి యత్నించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2:30 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు షాపు తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు.
ముందస్తు ప్రణాళికతో కటింగ్ ప్లేయర్లు, ఇనుప రాడ్లతో వచ్చిన దుండగులు.. ముందుగా విద్యుత్ వైర్లను, అనంతరం సీసీ కెమెరాల కనెక్షన్లను కత్తిరించారు. ఆ తర్వాత షాపు వెనుక భాగంలోని రేకులను తొలగించి లోపలికి చొరబడేందుకు యత్నించారు. అయితే ఎంత ప్రయత్నించినా షాపు తాళాలు పగలకపోవడం, అదే సమయంలో అటుగా వాహనాల రాకపోకలు సాగుతుండటంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.
వారం రోజుల వ్యవధిలోనే షాపులో చోరీకి యత్నించడం ఇది రెండోసారని బాధితులు తెలిపారు. ఆరు రోజుల క్రితమే దుకాణం తాళాలు పగలగొట్టి దాదాపు ₹10,000 విలువైన సరుకులతో పాటు కొంత నగదును అపహరించారని షాపు నిర్వాహకుడు చెన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, అదే ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లులోనూ దొంగలు తరచూ బియ్యం బస్తాలను ఎత్తుకెళ్తున్నారని మిల్లు నిర్వాహకులు వాపోతున్నారు. స్థానికంగా వరుస చోరీ యత్నాలు జరుగుతుండటంతో వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు.




