Sathupalli: గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలి – సీడీపీఓ సత్యవతి

Sathupalli: సత్తుపల్లి మండలం కిష్టారంలో పోషకాహార మాస ఉత్సవాలు. గర్భిణీలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని సీడీపీఓ సత్యవతి సూచన.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 11 Sept 2026 8:41 PM IST
Sathupalli
X

Sathupalli: గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలి – సీడీపీఓ సత్యవతి

సత్తుపల్లి: గర్భిణీలు పోషక విలువ కలిగిన ఆహారం తీసుకుంటే రక్తహీనత సమస్యలు లేకుండా సుఖ ప్రసవం అవుతారని సిడిపిఓ సత్యవతి అన్నారు. సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం 6 అంగన్వాడి కేంద్రంలో టీచర్ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మాస ఉత్సవాలలో సత్యవతి మాట్లాడుతూ గర్భిణీగా గుర్తించిన దగ్గర్నుంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని అన్నారు.

కిష్టారం సెక్టార్ సూపర్వైజర్ రజిని మాట్లాడుతూ వ్యక్తిగత ,పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు. పరిశుభ్రత వలన వ్యాధులు దరి చేరకుండా ఉంటాయన్నారు. చిన్నారులను ప్రైవేటు పాఠశాలకు వ్యానులు ఎక్కించి పంపించ వద్దన్నారు. స్థానికంగా అంగన్వాడి కేంద్రాలకు పంపించి బలోపేతం చేయాలని అన్నారు.

గ్రామ సర్పంచ్ నరుకుల్లా రాజేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన అదనపు ఆహారాన్ని ప్రదర్శించి తయారు చేసే విధానాన్ని తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఏఎన్ఎం బేగం తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI