Sathupalli: విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసిన దివ్యాంగుల సేవా ఆశ్రమం
Sathupalli: సత్తుపల్లిలో పేద విద్యార్థుల చదువు కోసం ముందుకు వచ్చిన దివ్యాంగులు. రుద్రాక్షపల్లి పాఠశాల పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేసిన స్వర్ణిక ఆశ్రమం.
Sathupalli: విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసిన దివ్యాంగుల సేవా ఆశ్రమం
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం రోడ్ నందు గల స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో రుద్రాక్షపల్లి ప్రైమరీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చెయ్యడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ పేద పిల్లల్ని ప్రోస్తహించుటకు దివ్యాంగులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చెయ్యడం చాలా గొప్ప విషయం, పేద పిల్లలకు నోట్ బుక్స్ మరియు పెన్నులు ఇచ్చి చదువుకొనుటకు మంచి ఆలోచన చేశారు అని ఆశ్రమ నిర్వహకులు వలపర్ల రవికుమార్ నీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




