Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
Kothagudem: కొత్తగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు.
Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
Kothagudem: బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కారుకొండ రామారం గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ.. మొఘల్ పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన రాజ్య స్థాపన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. “కొడితే గోల్కొండ కోటనే కొట్టాలే” అనే స్ఫూర్తితో పోరాడిన పాపన్న గౌడ్ ధైర్యం, త్యాగం, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
పాపన్న గౌడ్ ఆశయాలను నేటి యువతకు, భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కొత్తగూడెం ప్రధాన సెంటర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. పాపన్న గౌడ్ చరిత్రకు తగిన గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కారుకొండ గ్రామవాసులు, గౌడ సంఘం కుల పెద్దలు, బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు రాయుడు నాగేశ్వరరావు, కనకుంట్ల రాజమౌళి, నోముల రమేష్, సాంబ గౌడ్, కొత్తగూడెం పట్టణ ప్రధాన కార్యదర్శి చంద్రగిరి రమేష్, భాస్కర్ గౌడ్, గిరి తదితరులు పాల్గొని సర్దార్ పాపన్న గౌడ్‌కు ఘన నివాళులర్పించారు.




