Burgampahad: సారపాకలో 2000 మొక్కల నాటే కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్

Burgampahad: బూర్గంపాడు మండలం సారపాక అప్రోచ్ రోడ్డుకు ఇరువైపులా 2000 మొక్కల పెంపకం. కాలుష్య నివారణకు మొక్కలు నాటాలని సర్పంచ్ పిలుపు.

G Ravi, Bhadradri
Published on: 25 Aug 2026 11:36 AM IST
Burgampahad
X

Burgampahad: సారపాకలో 2000 మొక్కల నాటే కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్

Burgampahad: గ్రామంలో పచ్చదనం పెంచడం కోసం కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని సారపాక సర్పంచ్ కిషోర్ నాయక్ పిలుపునిచ్చారు.

బూర్గంపాడు మండలం సారపాక అప్రోచ్ రోడ్డు కి ఇరువైపులా అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం అందించటంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడానికి రెండు వేల మొక్కలు వనమహోత్సవం సందర్భంగా నాటినట్టు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చంగల్ రావు ఐటిసి డిప్యూటీ gm, ఎంపీడీవో జములా రెడ్డి, ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, రవి కార్యదర్శి, బాలి శ్రీహరి, ఏపీవో విజయ్ లక్ష్మి, పూలపల్లి సుధాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story