Kothagudem: రైతులకు గుడ్ న్యూస్.. పంట రుణ రైతులకు రూ.1 లక్ష గ్రూప్ ఇన్సూరెన్స్!

Kothagudem: సహకార సంఘం పరిధిలో పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ.1 లక్ష గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు మండె వీర హనుమంతరావు తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Aug 2026 5:37 PM IST
Kothagudem
X

Kothagudem: రైతులకు గుడ్ న్యూస్.. పంట రుణ రైతులకు రూ.1 లక్ష గ్రూప్ ఇన్సూరెన్స్!

కొత్తగూడెం, ఆగస్టు 14: కొత్తగూడెం సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం కార్యవర్గ సభ్యుల సమావేశం సంఘం అధ్యక్షులు మండె వీర హనుమంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ పంట రుణాలు తీసుకున్న రైతులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్‌లో సభ్యుల్లో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబానికి రూ.1 లక్షల వరకు బీమా పరిహారం అందుతుందని పేర్కొన్నారు.

అలాగే ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) కింద సంఘ పరిధిలోని 750 మంది సభ్యుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2,000 చొప్పున మొత్తం రూ.15 లక్షలు వసూలు చేసి బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద మరో రూ.15 లక్షలు అందించనున్నట్లు వెల్లడించారు.

ఈ నిధులతో సుజాతనగర్‌లో పురుగుమందుల వ్యాపారం ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించినట్లు హనుమంతరావు తెలిపారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సంఘ ఆర్థిక కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.

సమావేశంలో సొసైటీ కార్యదర్శి N.V.రమణారెడ్డి, సంఘ డైరెక్టర్లు చంద్రగిరి శ్రీనివాసరావు, కర్ణాటకపు రామచంద్రరావు, తీట్ల విజయకుమారితో పాటు సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story