Etapaka: కన్నాయిగూడెం వద్ద రోడ్డు నిర్మించాలంటూ గ్రామస్తుల రాస్తారోకో!

Etapaka: పోలవరం జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం వద్ద గ్రామస్తులు, రాజకీయ పార్టీల రాస్తారోకో.. గుంతలమయమైన రోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్.

RAJESH REDDY, CHINTOOR
Updated on: 12 Sept 2026 12:28 PM IST
Etapaka
X

Etapaka: కన్నాయిగూడెం వద్ద రోడ్డు నిర్మించాలంటూ గ్రామస్తుల రాస్తారోకో!

Etapaka: పోలవరం జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామంలో గ్రామ ప్రజలు, సిపిఎం, వైసీపీ తదితర పార్టీల నాయకులు రోడ్డు కోసం శనివారం రాస్తారోకో చేయడం జరిగింది.రాజుపేట నుండి కన్నాయిగూడెం వరకు రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికుల పాలిట మృత్యుకుహరంలా మారిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ సందర్భంగా సిపిఎం నేత ఐ.వి మాట్లాడుతూ నిత్యం ఈ రహదారి పై వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయని ఈ సమయంలో గుంతల వద్ద వాహనదారులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రధానంగా ఈ రహదారి పై రోజు పదుల సంఖ్యలో ఇసుక లారీలు తిరుగుతుండడంతో ఈ రహదారి మరమత్తులకు గురైందని అన్నారు.

రహదారి గుంతలమయంగా మారిన ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అసలు చింతూరు ఏజెన్సీలో ఆర్టీవో అధికారులు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు.ఈ రహదారి పై భారీ గుంతలు ఏర్పడిన పట్టించుకునే నాధుడే కరువైపోయారు అని వాపోయారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన రహదారిని నిర్మించాలని డిమాండ్ చేశారు.రహదారి నిర్మించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు జి.హుస్సేన్. జె.సంపత్, బేతి మంగయ్య, శేషయ్య, స్థానిక నాయకులు ప్రజలు ఇతర పార్టీల నాయకులు పాల్గొనడం జరిగింది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR