Khammam: వ్యభిచార నిర్వాహకుడిపై పీడీ యాక్ట్: ఖమ్మం సీపీ సునీల్ దత్
Khammam: ఖమ్మంలో మహిళలను వ్యభిచారంలోకి దింపి ఆర్థిక లాభాలు పొందుతున్న బత్తుల బాలకృష్ణపై సీపీ సునీల్ దత్ పీడీ యాక్ట్ ప్రయోగించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Khammam: వ్యభిచార నిర్వాహకుడిపై పీడీ యాక్ట్: ఖమ్మం సీపీ సునీల్ దత్
ఖమ్మం జిల్లా: ముదిగొండ మండలం, చిరుమర్రి గ్రామానికి చెందిన నిందితుడు బత్తుల బాలకృష్ణ, 30సం,,ఆర్థిక లాభాల కోసం జిల్లాలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తూ,మహిళలను వ్యభిచారంలోకి తీసుకువచ్చే అసాంఘిక, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు బాలకృష్ణపై ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఖమ్మం టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో, అనైతిక రవాణా, వ్యభిచార నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
2026 జనవరి 6న విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం గాంధీచౌక్‌లోని ఓ లాడ్జిలోని గది ని పోలీసులు దాడి చేశారు. వ్యభిచార కార్యకలాపాల కోసం లాడ్జిలో గది పొందేందుకు అధిక మొత్తంలో డబ్బు చెల్లించినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బాలకృష్ణ, మెరెడ్డి సత్యవతి, లాడ్జి మేనేజర్ అలకుంట్ల శ్రీకాంత్ తో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించినట్లు తెలిపారు. కాకినాడ కు చెందిన మహిళను ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకొని
వ్యభిచారంలోకి తీసుకువచ్చినట్లు, ఖమ్మంకు తరలించి లాడ్జి గదిలో ఉంచి, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది.
నిందితుడి నేర ప్రవర్తనను నిరోధించేందుకు శాంతిభద్రతల పరిరక్షణ, ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం, 1986 (పీడీ యాక్ట్) సెక్షన్ 3(2) కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి చంచల్‌గూడ సెంట్రల్ జైలు కు తరలించారు.




