Aswaraopeta: గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్

Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన 385 కేజీల గంజాయి పట్టుబడింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 22 May 2026 3:50 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్

అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలలో పోలీసు వారు నిర్వహించిన వాహన తనిఖీలలో 385 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది, దీని విలువ సుమారు రూ.2 కోట్లు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల RTO చెక్‌పోస్ట్ వద్ద అశ్వారావుపేట పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలో ఆంధ్రప్రదేశ్ /ఒరిస్సా బోర్డర్ నుండి రాజస్థాన్ వెళ్తున్న నలుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠా వారి వద్ద నుండి 300 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఇట్టి వాహన తనిఖీలో 01 కార్ మరియు 01 లారీను సీజ్ చేసి 04గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.

అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రహదారిపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలో ఒరిస్సా నుండి బెంగళూరు వెళ్తున్న కారులో 85 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని ఇట్టి వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ వాహన తనిఖీలో 02 నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. జిల్లాలో 2024 నుండి ఇప్పటివరకు 212 కేసులు నమోదు కాగా 15398 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని 677 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఇట్టి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 77 కోట్లు.

ఇప్పటివరకు ముగ్గురు మీద పీడి యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించడం జరిగింది. జిల్లాలో గంజాయి సేవిస్తున్న పదిమందిని గుర్తించి వారిని డి అడిక్షన్ సెంటర్ కు తరలించడం జరిగింది. ఎవరైనా నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నట్టుగానీ, సేవిస్తున్నట్టుగాని వారి సంబంధించిన వివరాలు తెలిసినట్లయితే పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇట్టి గంజాయి పట్టుకోవడం లో కృషి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులను, అశ్వారావుపేట పోలీసులను, లక్ష్మీదేవిపల్లి పోలీసులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story