Kothagudem: డిగ్రీ కాలేజీ ముందు ఆర్టీసీ బస్సులు నిలపాలి: PDSU డిమాండ్!
Kothagudem: కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల ముందు ఆర్టీసీ బస్సులను నిలపాలని పిడిఎస్‌యు (PDSU) నేతలు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
Kothagudem: డిగ్రీ కాలేజీ ముందు ఆర్టీసీ బస్సులు నిలపాలి: PDSU డిమాండ్!
కొత్తగూడెం, ఆగస్టు 5: కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల ముందు ఆర్టీసీ బస్సులను నిలిపేలా చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) జిల్లా నాయకులు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 50 నుంచి 100 మంది విద్యార్థులు శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలకు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారని వారు తెలిపారు. కళాశాల ముందు అధికారిక బస్‌స్టాప్ ఉన్నప్పటికీ బస్సులు అక్కడ ఆగకుండా పాల కేంద్రం వద్ద మాత్రమే నిలుపుతున్నారని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు ప్రతిరోజూ కొంత దూరం నడిచి కళాశాలకు వెళ్లాల్సి వస్తోందని, ముఖ్యంగా వర్షాకాలంలో విద్యార్థినీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
విద్యార్థుల సౌకర్యార్థం కళాశాల ముందు ఉన్న బస్‌స్టాప్‌లోనే అన్ని సంబంధిత ఆర్టీసీ బస్సులను నిలిపేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు శ్రావణ్ కుమార్, జె. గణేష్, భాను ప్రసాద్, జస్వంత్, సాత్విక్, సాయి శివ, సాకేత్, వికాస్, శ్రావణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.




