Ashwaraopeta: అడవిలో వెలిగిన మానవత్వం చెన్నాపురంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు!

Ashwaraopeta: అశ్వారావుపేట చెన్నాపురం దట్టమైన అడవిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 3 Sept 2026 8:44 AM IST
Ashwaraopeta
X

Ashwaraopeta: అడవిలో వెలిగిన మానవత్వం చెన్నాపురంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు!

Ashwaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం చెన్నాపురం దట్టమైన అడవిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అశ్వారావుపేట జనసేన పార్టీ అరుదైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. అధికారులు సైతం వెళ్లడానికి జంకే మారుమూల అడవి ప్రాంతమైన మండలంలోని చెన్నాపురం కాలనీలో ఆదివాసీ బిడ్డల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు.

ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు ఇస్లావత్ వినోద్ కుమార్, నియోజకవర్గ నాయకురాలు ముయబోయిన ఉమాదేవి ఆధ్వర్యంలో సుమారు 45 మంది చిన్న పిల్లలకు నూతన పాదరక్షలు పంపిణీ చేశారు. అంతేకాకుండా చలికి వణుకుతున్న గ్రామస్తులందరికీ దుప్పట్లు పంపిణీ చేసి అండగా నిలిచారు. నగరాల్లో జరిగే ఆర్భాటపు వేడుకలకు భిన్నంగా అడవి బిడ్డల చిరునవ్వుల మధ్య జరిగిన ఈ వేడుక అందరినీ ఆకట్టుకుంది.

పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగున ఉన్న గిరిజనులకు సేవ చేయడమే నిజమైన పుట్టినరోజు కానుక అని మండల అధ్యక్షులు వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మల్లం రామకృష్ణ,మంగ గణేష్, గుమ్మళ్ళ పోసి బాబు, మారిన చరణ్ సాయి, కొనకళ్ళ రాజేష్, కార్యకర్తలు, పవన్ అభిమానులు పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA

Next Story