Palwancha: పెళ్లి చేసుకుంటానని మోసం ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా!

Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కోడిపుంజుల వాగులో ఘటన. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ఎదుట యువతి ధర్నా.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 17 Aug 2026 5:44 PM IST
Palwancha
X

Palwancha: పెళ్లి చేసుకుంటానని మోసం ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా!

Palwancha: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన ఘటన పాల్వంచ మండలం కోడిపుంజుల వాగు గ్రామంలో చోటుచేసుకుంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు భూక్య అభినందన్‌పై వజ్జ వినీత ఆరోపించింది.

వజ్జ వినీత తెలిపిన వివరాల ప్రకారం.. భూక్య అభినందన్ (19) కొంతకాలంగా తనను ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత రాత్రి తనను తీసుకెళ్లాడని పేర్కొంది. అనంతరం లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. అయితే పెళ్లికి నిరాకరించడంతో అభినందన్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగినట్లు తెలిపింది.

తనకు న్యాయం చేయాలని వినీత డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, యువతి చేసిన ఆరోపణలపై పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

Next Story