Palvancha: పిల్లలు పుట్టడం లేదని భార్యను వెలివేసిన భర్త.. న్యాయం కోసం ఇంటి ముందే ధర్నా!

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గాంధీ నగర్‌లో పెళ్లై మూడేళ్లయినా పిల్లలు పుట్టడం లేదనే నెపంతో భార్యను కాపురానికి తీసుకురావట్లేదని ఓ మహిళ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 9 Jun 2026 7:23 PM IST
Palvancha
X

Palvancha: పిల్లలు పుట్టడం లేదని భార్యను వెలివేసిన భర్త.. న్యాయం కోసం ఇంటి ముందే ధర్నా!

పాల్వంచ / భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ గాంధీ నగర్‌లో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదనే కారణంతో భార్యను కాపురానికి తీసుకురావడం లేదని ఆరోపిస్తూ ఓ మహిళ సోమవారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

గాంధీ నగర్‌కు చెందిన దంపతులకు వివాహమై మూడు సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగలేదు. దీంతో భర్త ఆమెను పుట్టింటికి పంపించి, తిరిగి కాపురానికి తీసుకురావడం లేదని బాధితురాలు ఆరోపిస్తోంది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె భర్త ఇంటి ముందు బైఠాయించింది.

సమాచారం అందుకున్న భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పాల్వంచ పోలీసులు పరిస్థితిని సమీక్షించి, ఉద్రిక్తత నెలకొనకుండా బాధిత మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

Next Story