Narsapuram: పడమటి నర్సాపురం విద్యార్థులకు నోట్‌బుక్కుల పంపిణీ

Narsapuram: పడమటి నర్సాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో నోట్‌బుక్ పంపిణీ చేసిన రాష్ట్రీయ లోక్ దళ్ జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యపై అవగాహన.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 9 July 2026 9:00 PM IST
Narsapuram
X

Narsapuram: పడమటి నర్సాపురం విద్యార్థులకు నోట్‌బుక్కుల పంపిణీ

నర్సాపురం: ఈరోజు పడమటి నర్సాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నోట్‌బుక్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కట్ట సతీష్ గారు మాట్లాడుతూ, "సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా మొత్తం విద్యార్థులకు నోట్‌బుక్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది" అని తెలిపారు.

స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షులు పృధ్వినాయక్ మాట్లాడుతూ జరిగిన పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ కూడా చేశాము గుర్తు చేశారు ఇప్పుడు నోట్ బుక్ ఇస్తున్నాను అని చెప్పారు గవర్నమెంట్ స్కూల్ మంచి విద్య ఉందని అన్నారు ప్రవేట్ స్కూల్ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో రాష్ట్రీయ లోక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మూడు వీరన్న, స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర కళ్యాణ్ నాయక్ చండ్రుగొండ మండల అధ్యక్షులు పసుపులేటి వీర ప్రసాద్, ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి లకావత్ నాగేశ్వరావు, జూలూరుపాడు మండల ఎంఈఓ జుంకీలాల్ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story