Kothagudem: కొత్తగూడెం: 5 రోజుల పాపను ప్రభుత్వానికి అప్పగించిన తల్లి!
Kothagudem: కొత్తగూడెంలో 5 రోజుల పసికందును ప్రభుత్వానికి అప్పగించిన తల్లి. 1098కి ఫోన్ చేయడంతో స్పందించిన అధికారులు.
Kothagudem: కొత్తగూడెం: 5 రోజుల పాపను ప్రభుత్వానికి అప్పగించిన తల్లి!
కొత్తగూడెం: ఐదు రోజుల వయస్సు కలిగిన నవజాత ఆడ శిశువును ప్రభుత్వనికి సరెండర్ చేసిన శిశువు తల్లి. శిశువు తల్లి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి విషయం తెలియ చేయగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో పాపను ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంటు సభ్యులు స్వాధీనపర్చుకున్నారు. ఛైల్డ్ ను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హజరు పరుచగా పాప ను భద్రాచలం లోని ఛైల్డ్ కేర్ హోం కు సంరక్షణ కోసం పంపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ భరత రాణి, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా, డిస్ట్రిక్ట్ ఛైల్డ్ ప్రోటెక్షన్ ఆఫిసర్ ఆదూరి శేషు, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 కోఆర్డినేటర్ బానోత్ సందీప్, నాగరాజు, లత, భారతి, రంజిత్ పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా ఆదేశాలతో డిస్ట్రిక్ట్ ఛైల్డ్ ప్రొటెక్షన్ ఆఫిసర్ ఆదూరి శేషు ప్రత్యేక చోరవతో శిశువును ఛైల్డ్ కేర్ హోం కు తరలించారు.
రాత్రి 9 గంటలు కావడం తో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణ లత లేనినా తన సోంత కారు లో పాపను భద్రాచలం లోని శిశు గ్రుహ కు పంపించి విధి నిర్వహణలో అమ్మతనం చాటుకున్నారని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ తెలిపారు. అలాగే ఏ తల్లిదండ్రులు అయిన ఏ ఇబ్బందుల వలన అయిన పిల్లలను పోషించుకోనే పరిస్థితి లో లేకుంటే వారు 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే డిపార్టుమెంటు వారి పిల్లలను తీస్కోని పునర్నివాసం ఏర్పాటు చేస్తుందని సాదిక్ పాషా తెలిపారు.




