Kothagudem: అడవులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు జిల్లా కాంగ్రెస్!
Kothagudem: అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశంలో జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ నాయకురాలు కుసుమ అలం కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Kothagudem: అడవులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు జిల్లా కాంగ్రెస్!
కొత్తగూడెం: ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి, వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించబడింది. డీసీసీ (DCC) ప్రెసిడెంట్ *తోట దేవిప్రసన్న గారి అధ్యక్షతన* జరిగిన ఈ సమావేశానికి జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ ఇంచార్జి కుసుమ అలం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమావేశంలో ఆదివాసీల హక్కులు, చట్టాల అమలు తీరుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సానుకూల విధానాలను చర్చించడంతో పాటు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఆదివాసీలే ఈ దేశానికి అసలైన యజమానులు "కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఎల్లప్పుడూ ‘ఈ దేశ యజమానులు ఆదివాసీలే’ (ఇస్ దేశ్ కా మాలిక్ ఆదివాసీ) అని గౌరవిస్తుంటే. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం వారిని కేవలం అడవులకే పరిమితం చేస్తూ 'వనవాసులు'గా చిత్రీకరించే కుట్ర చేస్తోంది.
ఆదివాసీల ఉనికిని, గుర్తింపును దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అమాయక ఆదివాసీలను పొట్టనబెట్టుకుంటోంది.
అడవుల్లోని అపారమైన సహజ వనరులను, భూములను అదానీ, అంబానీ లాంటి పెద్ద కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోంది. ఆదివాసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెపాలని కోరారు.
ఈసమావేశానికి విశిష్ట అతిథిగా హాజరైన ఇల్లందు MLA కోరం.కన్నయ్య మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు, చట్టాల సమర్థవంతమైన అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు,ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధులు, పూణెం శ్రీనివాస్, సర్పంచ్ లు తాటి అనిత, అజ్మీరా లైలా, వజ్జ భాస్కర్, లావుడ్య పూర్ణ, బానోత్ రాణి, బానోత్ జానీ, పాయం లక్ష్మీనర్సు, వర్ష.నరసింహ, ఎట్టి వెంకన్న, శరత్, బొర్రా శంకర్, పడిగ వెంకన్న, ఉబ్బని రాజు, బక్కయ్య, కోరం నరేష్, చంద్రకళ, కృష్ణవేణి మరియు ముఖ్య కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




