Julurpadu: వర్షాభావ పరిస్థితులపై ఎంపీడీవో తాళ్లూరి రవి అవగాహన!

Julurpadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రతి రైతు పొలంలో పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో తాళ్లూరి రవి సూచన.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 21 Aug 2026 4:06 PM IST
Julurpadu
X

Julurpadu: వర్షాభావ పరిస్థితులపై ఎంపీడీవో తాళ్లూరి రవి అవగాహన!

Julurpadu: జూలూరుపాడు మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి రైతు తన పొలంలో పంట కుంటలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని సంరక్షించుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) తాళ్లూరి రవి కోరారు.

ఈరోజు జూలూరుపాడు గ్రామపంచాయతీ పరిధిలో రైతు సాయిల్ కృష్ణ ఏర్పాటు చేసుకున్న పంట కుంటను ఎంపీడీవో తాళ్లూరి రవి పరిశీలించి, పంట కుంటను ప్రారంభించారు. పంట కుంట ఏర్పాటు చేసుకున్నందుకు రైతు సాయిల్ కృష్ణను ఈ సందర్భంగా ఎంపీడీవో అభినందించారు.

అనంతరం పంట కుంట వద్ద ఉన్న కూలీలు, రైతులతో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై అవగాహన కల్పించారు. వర్షాలు సమృద్ధిగా కురవని పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చే ప్రతి చుక్క వర్షపు నీటిని పొలాల్లో నిల్వ చేసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. పంట కుంటల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పంటలకు అవసరమైన సమయంలో నీటిని వినియోగించుకోవడంతో పాటు భూగర్భ జలాల పెరుగుదలకు కూడా దోహదపడుతుందని వివరించారు.

మండల వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులందరూ ముందుకు వచ్చి పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో తాళ్లూరి రవి పదేపదే విజ్ఞప్తి చేశారు. పంట కుంటల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకుని నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.

“వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భూగర్భ జలాలను పెంచి.. పంటలను కాపాడుకుందాం” అనే లక్ష్యంతో ప్రతి రైతు పంట కుంట ఏర్పాటు చేసుకునేలా గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత సిబ్బందిని కూడా సూచించారు.

ఈ పర్యటనలో ఏపీవో రామారావు, ఎఫ్ఏ భద్రం తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story