Khammam: పొదిల రవికుమార్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ తాతా మధు

Khammam: ఖమ్మంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొదిల రవికుమార్ తండ్రి దేవేంద్రనాథ్ మృతి పట్ల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 13 Sept 2026 7:59 PM IST
Khammam
X

Khammam: పొదిల రవికుమార్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ తాతా మధు

Khammam: ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్వర్గీయ దేవేంద్రనాథ్ చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు.ఖమ్మం వాస్తవ్యులు,ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొదిల రవికుమార్ తండ్రి దేవేంద్రనాథ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా తాతా మధు ఆదివారం సాయంత్రం స్వర్గీయ దేవేంద్రనాథ్-విజయలక్మీ దంపతుల చిత్రపటానికి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు,రవికుమార్ ను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం, బీఆర్ఎస్ నాయకుడు బెల్లం వేణు తదితరులు ఉన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.