Kothagudem: కొత్తగూడెంలో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని పూజలు చేశారు.
Kothagudem: కొత్తగూడెంలో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు!
Kothagudem: వినాయక చవితి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని కలశ పూజ నిర్వహించారు. అనంతరం వినాయక చవితి వేడుకల పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ ఈవో రజనీ కుమారి, అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నియోజకవర్గ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కొత్తగూడెంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి పండుగలను జరుపుకోవడం విశేషమన్నారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయానికి ఆదాయం పెంచేలా 450 గజాల ఆలయ భూమిలో కళ్యాణ మండపం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే సొంత ఇంటి స్థలం ఉన్న పేద బ్రాహ్మణులకు ఇళ్ల నిర్మాణానికి సహకరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వినాయక చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా,
భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాష,పల్లపోతు సాయి, జమలయ్య ,యూసఫ్ తదితరులు పాల్గొన్నారు




