Kothagudem: కొత్తగూడెంలో 12వ తెలంగాణ అవతరణ వేడుకలు
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.
Kothagudem: కొత్తగూడెంలో 12వ తెలంగాణ అవతరణ వేడుకలు
కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో మంగళవారం ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముందుగా తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు
ఈ కార్యక్రమంలో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జూలూరుపాడు మండలానికి చెందిన యెల్లంకి కలావతి (జూలూరుపాడు), కేలోత్ బాలూ (సాయిరాం తండా), బడావత్ లలిత (గుండ్లరేవు), చిమట వెంకట నరసమ్మ (సంబునిగూడెం)లకు మంత్రి మంజూరు పత్రాలను అందజేశారు. అలాగే 478 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.51.06 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. వ్యవసాయ యాంత్రికరణ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.59.53 లక్షల విలువైన ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వివిధ విద్యాసంస్థల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళాప్రదర్శనలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రగతి ప్రదర్శన స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అంతకుముందు జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో తన క్యాంపు కార్యాలయం, ఐడీఓసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డిఆర్ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందేశమిచ్చారు..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో పనేండు ఏళ్ళు నిండాయి. ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాభినందనలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
ఎందరెందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశదిశలా వెలుగులు విరజిమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వ పడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్నా పెద్దలందరికీ... పేరు పేరునా ప్రణామాలు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ' ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ పేరిట మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి వేగవంతంగా పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ 99 రోజుల కాలంలో పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవల సరళీకరణ, ఉపాధి అవకాశాల కల్పన, మహిళల ఆర్థిక సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వివిధ అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్లు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. పది వారాల పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మరింత వేగం తీసుకువచ్చారు. తద్వారా ప్రజాకేంద్రిత పాలనను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తున్నారు
రైతును రాజును చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలు చేపడుతోంది. దేశంలో తొలిసారిగా రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేయడంతో పాటు, రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.12,000 చొప్పున ఇప్పటివరకు జిల్లాలో 2 లక్షల 7 వేల మూడు 391 మంది రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి 44 కోట్ల 39 లక్షల రూపాయలు పెట్టుబడి సాయం నేరుగా జమ చేయడం జరిగింది.
అదేవిధంగా 63 వేల 614 మంది రైతులకు 4 వందల 55 కోట్ల 33 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ఒక లక్ష 5 వేల 871 మంది రైతులకు రైతు బీమా మంజూరు చేయగా, అందులో ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది రైతు కుటుంబాలకు రూ.96 కోట్ల 20 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 530 రైతులకు 3 కోట్లు, ప్రకృతి వ్యవసాయం కు ప్రోత్సాహం అందిస్తున్నాం,
ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ: తెలంగాణ రాష్ట్రంలోనే ఆయిల్ ఫామ్, కోకోసాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో మన జిల్లా ఉన్నది. జిల్లాలో 88 వేల 438 ఎకరాలలో ఆయిల్ ఫామ్, 657 ఎకరాలలో అంతర్ పంటగా కో కో సాగు లో ఉ న్నది. బిందు సేద్య పథకం కింద ఎస్సీ ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ మరియు ఇతర రైతులకు 90 శాతం, ఐదు ఎకరాల పైబడిన రైతులకు 80 శాతం సేద్య పరికరాలపై ఇప్పటి వరకు 51 వేల 226 ఎకరాలకు రాయితీని అందించడం සñයි.
సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ పనులు పూర్తిఅయ్యి 3 పంప్ హౌసులు ప్రారభించండం జరిగింది. ప్రధాన కాలువ నుండి ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా నీటి విడుదల జరిగినది. ఉప ప్రధాన కాలువ పనుల టెండర్లు జరుగుతున్నవి. ఈ ప్రాజెక్ట్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,57,574 ఎకరముల కొత్త ఆయకట్టుకు మరియు చిన్న నీటి తరహా చెరువుల క్రింద గల 42,935 ఎకరముల స్థిరీకరించుటకు ప్రతిపాదించబడినది.
సీతమ్మ సాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ కొరకు 3123 ఎకరములు భూ సేకరణ పూర్తి అయినది. మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా (పెద్దవాగు, తాలిపేరు, కిన్నేరసాని) 37,060 ఎకరములకు, 2364 చిన్న తరహా నీటిపారుదల వనరులు కలవు వీటి యొక్క ఆయకట్టు 1,32 వేల 829 నీటిపారుదల వసతి కల్పించబడుచున్నది. 21 చెక్ డ్యాం లకు రూ. 11785.81 లక్షలతో, 7275 ఎకరాలను సాగులోనికి తీసుకురావడానికి జరిగింది. 21 పనులకు టెండర్లు పూర్తి అయినవి. పనులు జరుగుతున్నవి.
రైల్వే లైన్లు మరియు విమానాశ్రయ ఏర్పాటు: జిల్లా సమగ్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి మరియు రవాణా సౌకర్యాల విస్తరణ లక్ష్యంగా పాండురంగాపురం--సారపాక రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అలాగే కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటు కోసం ఆమోదం పొందేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతూ, జిల్లాకు మెరుగైన వైమానిక అనుసంధానం కల్పించేందుకు కృషి కొనసాగుతోంది.
కామన్ డైట్ చార్జీలు పెంపకం: విద్యార్థులు రాష్ట్ర సంపద. వారికి నాణ్యమైన విద్యతో పాటు మౌలికసదుపాయాలు కల్పించాల్సిన భాధ్యతను ప్రభుత్వం గుర్తించి, పేద విద్యార్థుల చదువుతో పాటు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకే రకమైన పౌష్టిక ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచారు. దీంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమ వసతిగృహాల్లో ఒకేసారి కామన్ మెనూ విజయవంతంగా ప్రారంభమైంది.
విద్యాశాఖ: ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రూపొందించడంలో భాగంగా రాష్ట్రంలోని పైలెట్ ప్రాజెక్టుగా కృత్రిమ మేధా (AI) ఉపయోగించే కార్యక్రమం పది పాఠశాలలలో మొదలుపెట్టాము. ఈ విద్యా సంవత్సరంలో 1 నుండి 9వ తరగతి వరకు కృత్రిమ మేధా పాఠ్యాంశంగా బోధించనున్నాము. జిల్లాలో 1323 పాఠశాలలో 59 వేల 88 మంది విద్యార్థులకు పోషకాహార మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది.
ఈ విద్యా సంవత్సరం నుండి ఉదయం అల్పాహారం కూడా అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలు చేపట్టాము.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు: జిల్లాలోని గిరిజన, పేద, బడుగు, బలహీన, సామన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలలో శిక్షణ ఇవ్వడం కోసం 20 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో జిల్లా లో కొత్తగూడెం, భద్రాచలం అశ్వరావుపేట, ఇల్లందు, పినపాక నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది.
జిల్లా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగేలా దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని కొత్తగూడెంలో ప్రారంభించడం జరిగింది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 19 వేల 373 మందికి ఈ పథకం ద్వారా వైద్య సేవలు కు గాను 57 కోట్ల 19 లక్షల రూపాయలు ఖర్చు అయింది..
తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా లక్షా 64 వేల 261 మందికి 119 రకాల ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య శిబిరాలు ద్వార జిల్లాలో 7 వేల 36 క్యాంపులు నిర్వహించి ఒక లక్షా 99 వేల 683 మందికి వైద్యసేవలు అందించడం జరిగింది. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా 29 వేల 51 మంది మహిళలను పరీక్షించడం జరిగింది.
పౌర సరఫరాల శాఖ: జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా 9 లక్షల 59 వేల 655 మందికి లబ్ధి చేకూరుతుంది. 167 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ద్వారా 3 వేల 857 మంది రైతుల నుండి 31 వేల 45 మెట్రిక్ట్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 73 కోట్ల 63 లక్షలు చెల్లించాం. జిల్లాలో ఖరీఫ్ సాగులో సన్న రకం వరి ధాన్యం 21 వేల 952 రైతులకు గాను 67 కోట్ల 80 లక్షలు బోనస్ చెల్లించడం జరిగింది.
గృహజ్యోతి.. జిల్లాలో 71 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో 26 విద్యుత్ ఉపకేంద్రాలు, 3 కోట్ల 67 లక్షల రూపాయలతో 5 కొత్త 33 కెవి ఉపకేంద్రాలను నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ఒక లక్షా 84 వేల 541 మంది వినియోగదారులకు 40 కోట్ల 76 లక్షల రూపాయల విద్యుత్ చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా.. ఉచిత బస్సు ప్రయాణం అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 5 కోట్ల 36 వేల మంది మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ఒక లక్షా, 55 వేల 720 మంది లబ్దిదారులకు 500 రూపాయలకే గ్యాస్ అసిలెండర్ ఇస్తూ, ఇప్పటి వరకు 8 లక్షల 17 వేల 611 సిలెండర్లు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు.
మహిళలు, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ: ఆధ్వర్యంలో యుక్తవయసు బాలికల్లో రక్తహీనత నివారణ కోసం ఇందిరమ్మ అమృతం పథకంను జిల్లాలో ప్రారంభించగా, 26 వేల మంది బాలికలు లబ్ధి పొందుతున్నారు. మిషన్ వాత్సల్య కింద 311 మంది అనాథ పిల్లలకు రూ.2 కోట్ల 98 లక్షల 56 వేల ఆర్థిక సహాయం అందించారు. జిల్లాలోని 2,061 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 28 వేల 493 మంది చిన్నారులకు పౌష్టికాహారం, బాలామృతం, గుడ్లు అందిస్తుండగా, 12 వేల 436 మంది గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందిస్తున్నారు. అలాగే దివ్యాంగుల సంక్షేమం కోసం 51 రెట్రోఫీటెడ్ మోటార్ వాహనాలు, 15 బ్యాటరీ వీల్చైర్లు, 20 మొబైల్ బిజినెస్ బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశారు.
పేద వాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరులో భాగంగా తొలి విడతగా జిల్లా వ్యాప్తంగా 17 వేల 988 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసాం. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు శ్రీకారం చుట్టాం.
గిరిజన సంక్షేమ శాఖ: గిరిజన విద్యాభివృద్ధికి జిల్లాలోని 306 ఆశ్రమ పాఠశాలలు,
ప్రాథమిక పాఠశాలలు, వసతి గృహాల్లో 24 వేల 345 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ల కింద రూ.15 కోట్ల 67 లక్షలు, ప్రీమెట్రిక్ విభాగంలో రూ.2 కోట్ల 10 లక్షల 42 వేల నిధులు మంజూరు చేశాం. విద్యా నాణ్యత పెంపు కోసం ప్రత్యేక ఉద్దీపకం వర్క్ బుక్లతో బోధన నిర్వహించడంతో పాటు,. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు రూ.25 లక్షల విలువైన 30 ల్యాప్టాప్లను అందజేశారు. భద్రాచలం ఐటిడీఏలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశాం.
ఎస్సీ అభివృద్ధి శాఖ: 22 ప్రీ మెట్రిక్ వసతిగృహాల్లో 908 మంది బాలురు, 536మంది బాలికలు, 9 పోస్టు మెట్రిక్ వసతిగృహాల్లో 377 మంది బాలురు, 382 మంది బాలికలకు వసతి కల్పించాం. 2 వేల 208 మంది విద్యార్ధులకు 8 కోట్ల 36 లక్షల 76 వేల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్, 518 విద్యార్థుల కు ఉపకార వేతనాలు చెల్లించాం . బెస్ట్ అవైలబుల్ స్కీం క్రింద 403 మంది విద్యార్థులకు ఒక కోటి 28 లక్షల 38 వేలు మంజూరు చేశాం. కులాంతర వివాహాలు చేసుకున్న 60 జంటలకు ఒక కోటి 50 లక్షలు మంజూరు చేశాం. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఆరుగురికి 82 లక్షల 54 వేలు మంజూరు చేశాం.
వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ: జిల్లాలో 12 బాలురు, 5 బాలికల వసతిగృహాలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో 1220 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాం. 10 పోస్ట్ మెట్రిక్ కళాశాలల వసతిగృహాల్లో 709 విద్యార్థిని, విద్యార్థులకు వసతి కల్పించాం. ప్రభుత్వం విడుదల చేసిన నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరంలో ఆర్ టి ఎఫ్ ద్వారా 15 కోట్ల 77 లక్షలు, ఎంటిఎఫ్ ద్వారా 1 కోటి 77 లక్షల 12 వేలు, అలాగే ఈబిసి విద్యార్థులకు ఒక కోటి 59 లక్షల రూపాయలు ఉపకార వేతనాలు చెల్లించడం జరిగింది. 288 మంది గీత కార్మికులకు భద్రతా కిట్స్ పంపిణీ చేశాం.
మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో 6 గురుకుల పాఠశాలలు, 6 గురుకుల కళాశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన చేపడుతున్నాము. ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి ఒక లక్షా 25 వేలు ఖర్చు చేయబడుతుంది. 2 వేల 756 మంది విద్యార్థులకు ఇప్పటివరకు ఒక కోటి 26 లక్షల రూపాయల ఉ పకార వేతనాలు మంజూరు చేయడం జరిగింది. షాది ముబారక్ క్రింద 269 మందికి 2 కోట్ల 69 లక్షలు మంజూరు చేయడం జరిగింది.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ: ఈ ఆర్థిక సంవత్సరానికి 32 లక్షల 52 వేలు పని రోజులు కల్పన లక్ష్యం కాగా ఇప్పటి వరకు 33 లక్షల 5 వేల పని రోజులు పూర్తి చేసి, ఇప్పటి వరకు కార్మికులకు 86 కోట్ల 25 లక్షలు, మెటీరియల్ కాంపోనెంట్ క్రింద 57 కోట్ల 73 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. వనమహోత్సవంలో 25 లక్షల 60 వేల మొక్కలు నాటడం లక్ష్యం కాగా జిల్లాలోని 470 పంచాయతీ నర్సరీల్లో 38 లక్షల 25 వేల మొక్కల పెంపకం చేపట్టాం. ఒక వేయి 858 నూతన మరుగుదొడ్లు, మండలాల్లో 18 సామూహిక మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టాం.
మైక్రో ఎంటర్ప్రైజెస్ ద్వారా 11 వేల 161 మందికి పాడి పశువుల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, కోళ్ల పెంపకం, మిల్క్ పార్లర్లు మరియు క్యాంటీన్ల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయడం జరిగింది. చేయూత పింఛన్ లో భాగంగా ఒక లక్షా 13 వేల 715 మందికి నెలకు 25 కోట్ల 69 లక్షలు చెల్లించడం జరుగుతుంది. 321 గ్రామ సమాఖ్య భవనాలకు గాను 32 కోట్ల 10 లక్షలు మంజూరు చేయడం జరిగింది.
మహిళా శక్తి: జిల్లాలో ఐదు మున్సిపాలిటీలలో 4 వేల 347సంఘాలు, 167 పేద
ప్రాంత సమాఖ్యలు,నాలుగు పట్టణ సమాఖ్యలు ఉన్నాయి. 2025 - 26 సంవత్సరానికి గాను పట్టణ పేదల స్వయం సహాయక సంఘాల కు బ్యాంక్ లింకేజ్ క్రింద 172 కోట్ల 10 లక్షల రూపాయలను 1276 సంఘాలకు మంజూరు చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా జిల్లాలో 9 ఆర్టీసీ బస్సులు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా క్యాంటిన్లు, మీసేవ కేంద్రాలు, సంఘ వ్యాపారాలు మరియు వ్యక్తిగత వ్యాపారాల నిమిత్తం 22 కోట్ల 5 లక్షల రూపాయల వ్యయంతో 30 యూనిట్లు అదేవిధంగా సూక్ష్మ బుణ వ్యాపారాలకు 106 కోట్ల వ్యయంతో 516 యూనిట్ల స్థాపనకు రుణాలు మంజూరు చేయడం జరిగింది.
మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాలు నిరోధించడంలో, రహదారుల ప్రమాదాల నివారణలో, మత్తు పదార్థాల మరియు సైబర్ నేరాల నియంత్రణ కొరకు కృషి చేస్తున్న పోలిస్ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలుపుటలో ప్రజలు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరు పనిచేయాలనీ విజ్ఞప్తి చేసారు.




