Manuguru: పంచాయతీ రాజ్ చట్టం సవరణపై మణుగూరు సర్పంచ్‌ల హర్షం

Manuguru: పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 70(3) సవరణ ద్వారా గ్రామ పంచాయతీల సొంత ఆదాయం జీపీలకే కేటాయించడంపై మణుగూరు మండల సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేశారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 13 Sept 2026 4:45 PM IST
Manuguru
X

Manuguru: పంచాయతీ రాజ్ చట్టం సవరణపై మణుగూరు సర్పంచ్‌ల హర్షం

Manuguru: ఈరోజు మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సర్పంచ్ ల సమావేశం లో పల్లెలే దేశానికి పట్టు కొమ్మలని, పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యం అనేలా స్థానిక గ్రామ పంచాయతీలకొచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకి జమ చేయకుండా, గ్రామపంచాయతీ ఖాతాల్లోనే జమ చేసుకొని ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధి, అవసరాలకు తీర్మానం చేసుకొని ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ పంచాయతీ రాజ్ చట్టం_2018 సెక్షన్ 70(3) సవరణ చేస్తూ అసెంబ్లీలో తీర్మానము చేసి ఆమోదం తెలిపినందుకుగాను, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్ అధ్యక్షతన సర్పంచ్ ల సమన్వయంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారికి పంచాయతీరాజ్ శాఖామాత్యులు గౌరవ సీతక్క గారికి మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమంలో సమితి సింగారం సర్పంచ్ కలబోయినా మాధవరావు, కూనవరం సర్పంచ్ ఎనిక శ్వేతా, విప్పాలసింగారం సర్పంచ్ పాల్వంచ రాములు, లంకమల్లరం సర్పంచ్ పూనెం రమేష్, తోగ్గుడెం సర్పంచ్ మడకం రామకృష్ణ, గుట్టమాల్లరం సర్పంచ్ కారం పూజిత, బుగ్గసర్పంచ్ శెట్టిపల్లి మాధవి, కట్టుమల్లరం సర్పంచ్ జగిడి ప్రసాద్ లు హర్షం వ్యక్తం చేసారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA