Manuguru: మణుగూరు కోర్టులో న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణీ!

Manuguru: మణుగూరు కోర్టు ఆవరణలో న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొని కార్డులు అందజేసిన న్యాయమూర్తి కంభపు సూరిరెడ్డి.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 12 Sept 2026 7:20 PM IST
Manuguru
X

Manuguru: మణుగూరు కోర్టులో న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణీ!

Manuguru: మణుగూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన *అడ్వకేట్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం *శనివారం, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, మణుగూరు ప్రాంగణంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ కంభపు సూరిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మణుగూరు బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులకు హెల్త్ కార్డులను స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, న్యాయవాదుల సంక్షేమం మరియు ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. న్యాయవాదులు తమ వృత్తిపరమైన బాధ్యతలతో పాటు ఆరోగ్యంపై కూడా తగిన శ్రద్ధ వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రకాని గురుకృష్ణ, ప్రధాన కార్యదర్శి వీర మధుసూదన్, ఉపాధ్యక్షరాలు సావిత్రి, సీనియర్ న్యాయవాదులు పొనుగోటి కిషన్ రావు, జాడి చొక్కయ్య, అమృతలూరి.రామ్మోహన్ రావు, చిర్రా రవికుమార్, మేదరమెట్ల శ్రీనివాస్ రావు, చిర్ర సరస్వతి,పద్మావతి, సర్వేశ్వర రావు, సంధ్య, వాసవి పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA