Manuguru: మణుగూరులో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన!
Manuguru: మణుగూరులో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. 150 మందికి పరీక్షలు, 40 మంది ఉచిత శస్త్రచికిత్సలకు ఎంపిక అని సేవా సంఘం నిర్వాహకుల వెల్లడి.
Manuguru: మణుగూరులో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన!
Manuguru: చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం మరియు హైదరాబాద్‌లోని శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో మణుగూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అశోక్‌నగర్ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
ఈ శిబిరంలో మొత్తం 150 మంది రోగులకు (OP) కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 40 మందిని కంటి శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. శస్త్రచికిత్సలకు ఎంపికైన వారికి హైదరాబాద్‌లోని శంకర్ కంటి ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్స, లెన్స్ అమరిక, మందులు, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలను కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 950 మందికి పైగా నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి, వారి జీవితాల్లో వెలుగులు నింపింది. సమాజ సేవే లక్ష్యంగా సంఘం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్కేటీ గ్రూప్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు, మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రకాని గురుకృష్ణ, ప్రధాన కార్యదర్శి వీర మధుసూదన్, న్యాయవాదులు సరస్వతి, వాసవి, అశ్వాపురం స్వరాజారావు, హెవీ వాటర్ ప్లాంట్ మాజీ ఉద్యోగి ఎం. వెంకటేశ్వర్లు ,హాజరయ్యారు.
శిబిరాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన హైదరాబాద్ శంకర్ కంటి ఆసుపత్రి వైద్య బృందానికి, దాతలకు, స్వచ్ఛంద సేవకులకు, సహకరించిన ప్రజలకు చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం కమిటీ సభ్యులు రేఖ రాజశేఖర్, పెద్దిరెడ్డి గోపిరెడ్డి, సుంకు కనకరాజు, గునిగంటి చందర్, నమ్మి జగదీష్, తెలంగాణ సురేష్, కాసర్ల అనిల్, అడ్వకేట్స్ కె. శ్రీహరి, కపిల్ రాజు, అత్తులూరి అరుణ్ తదితరులు పాల్గొని శిబిరం విజయవంతం కావడానికి విశేష కృషి చేశారు.




