Manuguru: సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా ప్రకటించాలి సీపీఐ డిమాండ్!
Manuguru: తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా ప్రకటించాలని మణుగూరు సీపీఐ సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా డిమాండ్.
Manuguru: సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా ప్రకటించాలి సీపీఐ డిమాండ్!
Manuguru: సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా డిమాండ్ చేశారు శనివారం మణుగూరు సిపిఐ పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభ జక్కుల రాజబాబు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా ఎస్కే సాబీర్ పాషా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి, ఆ పోరాటంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని కోరారు.
తెలంగాణలో భూస్వామ్య, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటం ఫలితంగా లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సీపీఐకి ఉందన్నారు. వేలాది మంది రైతులు, కార్మికులు, ప్రజలు పోరాటంలో పాల్గొని త్యాగాలు చేశారని పేర్కొన్నారు.
చారిత్రక వాస్తవాలను పక్కనపెట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించడం సిగ్గుమాలిన చర్య అని సాబీర్ పాషా విమర్శించారు. నిజమైన చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా యువతకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణ నిజాం నవాబు నిరంకుశ పాలనకు దేశముక్కులు భూస్వాములు ఈ ప్రాంత ప్రజలను పీడిస్తూ వెట్టి చాకిరి బానిసత్వం కొనసాగిస్తూ మహిళలను అత్యాచారాలు చేస్తూ దమన కాండా నిర్వహించారు.
దీనికి వ్యతిరేకంగా ఆనాడు దొడ్డి కొమరయ్య, మోహిం మోహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, నాయకత్వాన ఆనాడు చాకలి ఐలమ్మ ,మల్లు స్వరాజ్యం ,చంద్ర రాజేశ్వరరావు ఇలా అనేకమంది నాయకత్వంలో వేలాదిమంది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాహితులై నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి సుమారు 5000 మంది ప్రాణత్యాగం చేశారని సెప్టెంబర్ 11 నుండి 17 వరకు జరిగిన పోరాటంలో వేలాదిమంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు చనిపోయారని , 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన జరిగిందని , కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సుమారు 24 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని, దేశంలోనే పెద్ద పోరాటం తెలంగాణ సాయుధ పోరాటమేనని దీనిని పాఠ్యాంశాలలో చేర్చాలని భవిష్యత్ తరాలకు అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, సమానత్వం కోసం జరిగిందన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మత రాజకీయం సృష్టిస్తున్నారని ఇది సరైన విధానం కాదని వారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గుర్తించి సెప్టెంబర్ 17న విమోచన దినంగా ప్రకటించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.
,ముందుగా సిపిఐ జెండాను రైతు సంఘం జిల్లా నాయకులు మంగి వీరయ్య ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సర్ రెడ్డి పుల్లారెడ్డి ,మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, మాట్లాడారు.మణుగూరు పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, జిల్లా సమితి సభ్యులు వై రాంగోపాల్ ,ఎడారి రమేష్, సోందే కుటుంబరావు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి తోట రమేష్
చింతల దశరథం, మండల సహాయ కార్యదర్శి వేర్పుల నరేష్, సాంబయ్య గూడెం సర్పంచ్ చీడం ఉషారాణి రామ0జవరం సర్పంచ్ బాడీస కల్పన ,బాడిస సతీష్, ఎస్ కే సర్వర్ ,పినపాక మండల కార్యదర్శి తోగటి కుమార్, జిల్లా సమితి సభ్యులు గడ్డం మనోరచారి, కరకగూడెం మండల కార్యదర్శి వంగర సతీష్,*నాయకులు ఎస్ వి నాయుడు, కొత్తపల్లి సీతారాములు, దండగల బాబు భీమరాజు కృష్ణ,, సిరిగద్దే సతీష్, ఎస్డి ఉమర్, ఆధర్ల రాములు నోముల రవి, కన్యబోయిన ప్రసాద్, బోసెట్టి సంపత్, యాకూబ్, శివయ్య, వెంకన్న ఆధార్ల రేణుక, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.




