Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు!

Kothagudem: కొత్తగూడెంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కూనంనేని కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆ ప్రాంతాన్ని సర్కిల్‌గా ప్రకటించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 9 Aug 2026 3:50 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు!

Kothagudem: ఆదివాసీ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొమరం భీం సర్కిల్ వద్ద 'ప్రపంచ ఆదివాసీ దినోత్సవ' వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై, గిరిజన విప్లవ వీరుడు కొమరం భీం పునర్నిర్మిత విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమరం బుచ్చయ్య, కుంజ సమ్మయ్యలు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసీ స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు, ఆత్మగౌరవ పోరాటాలకు కమిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. "జల్, జంగల్, జమీన్" సాధన కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన అమరవీరుడు కొమరం భీం ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గిరిజనుల చట్టబద్ధమైన హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.

ఈ వేడుకల్లో ఆదివాసీ తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ గిరిజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు మరియు ఆదివాసీ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story