Kothagudem: అమిత్ షా రాజీనామా చేయాలి కొత్తగూడెంలో యూత్ కాంగ్రెస్ నిరసన!

Kothagudem: దిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడులను ఖండిస్తూ కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన. అమిత్ షా రాజీనామాకు డిమాండ్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 25 Aug 2026 3:58 PM IST
Kothagudem
X

Kothagudem: అమిత్ షా రాజీనామా చేయాలి కొత్తగూడెంలో యూత్ కాంగ్రెస్ నిరసన!

Kothagudem: విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన నాయకులు. డీల్లీలో పరీక్షా పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, పెల్లెట్ తుపాకులతో దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు.

పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్ మాట్లాడుతూ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వారిపై పోలీసుల బలప్రయోగం చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షా పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీసుల దౌర్జన్యానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చీకటి కార్తీక్ అన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన ప్రభుత్వం నిరసనలను అణచివేసే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టడంతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే నిరసనలను అణచివేసే చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని చీకటి కార్తీక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story