Kothagudem: టెక్నాలజీతో నేరాలకు చెక్.. సైబర్ వారియర్లకు ఎస్పీ శిక్షణ!

Kothagudem: నేరాల నియంత్రణ, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వాడాలని కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సైబర్ వారియర్లకు సూచించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 10 Sept 2026 7:06 PM IST
Kothagudem
X

Kothagudem: టెక్నాలజీతో నేరాలకు చెక్.. సైబర్ వారియర్లకు ఎస్పీ శిక్షణ!

కొత్తగూడెం: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపు, సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ సాక్ష్యాల సేకరణలో మెరుగైన ఫలితాలు సాధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ సూచించారు.

జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గురువారం టెక్ టీమ్ ఆపరేటర్లు, సైబర్ వారియర్లకు వివిధ పోలీసింగ్ వెబ్ అప్లికేషన్లపై ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రోహిత్ రాజు శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీసీటీఎన్‌ఎస్ 2.0, క్రై-మాక్, ఐసీజేఎస్, టీఎస్-కాప్స్, డయల్-100, ఎఫ్‌ఆర్‌ఎస్, ఎంటర్‌ప్రైజ్ చెక్, ఈ-సాక్ష్య, సైక్యాప్స్, డోపామ్స్, ఎన్‌సీఆర్‌పీ, ఐరాడ్, సమన్వయ పోర్టల్, సీఈఐఆర్, దర్పణ్, సహయోగ్, వాత్సల్య, జిఆర్ఎం, ఎంఆర్ఎఫ్, నాట్ గ్రిడ్, గాండీవ తదితర వెబ్ అప్లికేషన్ల వినియోగంపై సిబ్బందికి శిక్షణ అందించారు.

శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఎస్పీ సూచించారు. సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయడంతో పాటు సాంకేతిక వనరులను పోలీసింగ్‌లో సమర్థంగా వినియోగించాలని టెక్ టీమ్ ఆపరేటర్లు, సైబర్ వారియర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ సీఐ రాము, సైబర్ సెల్ సీఐ జితేందర్, సీఐలు రమాకాంత్, లక్ష్మి, పోలీసు అధికారులు, టెక్ టీమ్ ఆపరేటర్లు, సైబర్ వారియర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story