Kothagudem: ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారుల సన్మానం
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రిటైర్మెంట్ వేడుకలు.
Kothagudem: ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారుల సన్మానం
కొత్తగూడెం: పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి పదవీ విరమణ పొందిన ఎస్ఐ, ఏఎస్ఐ, ఏఆర్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ లను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా సత్కరించారు.42 సంవత్సరాలు పోలీసు శాఖలో తమ సేవలను అందించి పదవీ విరమణ పొందిన ఎస్సై కసిబోయిన సత్యనారాయణ రాజు,37 సంవత్సరాలు పోలీసు శాఖలో తమ సేవలను అందించి పదవీ విరమణ పొందిన ఏఎస్సై జంపాల హనుమంతరావు, 41 సంవత్సరాలు పోలీసు శాఖలో తమ సేవలను అందించి ప్రస్తుతం పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన ఏఆర్ ఎస్ఐ ధారావత్ వెంకటేశ్వర్లు.
36 సంవత్సరాలు పోలీసు శాఖలో తమ సేవలను అందించి ప్రస్తుతం అశ్వాపురం నందు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ఎట్టా శ్రీనివాసరావు లు శనివారం నాడు పదవీ విరమణ పొందడం జరిగింది. పదవీ విరమణ పొందిన ఈ నలుగురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శాలువాలతో మరియు పూలమాలతో ఘనంగా సత్కరించి ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. పోలీస్ శాఖలో వీరి అనుభవాలను జిల్లా ఎస్పీతో పంచుకున్నారు, వారి కుటుంబ సభ్యులు కూడా వారి యొక్క అనుభవాలను పంచుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.ఎంతో కాలంగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలను నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన అధికారులు సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.
పోలీసు శాఖ నుండి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.తమ దైనందిన కార్యక్రమాలలో వ్యాయామం,యోగా,ధ్యానం వంటి వాటిని అనుసరిస్తూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.పదవీ విరమణ అనంతరం వారికి ప్రభుత్వం నుంచి అందవలసిన ప్రతిఫలాలు త్వరితగతిన అందేలా చూడాలని కార్యాలయ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణ మరియు జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.




