Kothagudem: కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్లకు రూ.30 కోట్లతో మహర్దశ!

Kothagudem: కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్ల ఆధునికీకరణకు రూ.30 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు. తన నిధుల నుంచి రూ.5 కోట్లు ప్రకటించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 6 Sept 2026 7:00 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్లకు రూ.30 కోట్లతో మహర్దశ!

Kothagudem: ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్లను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్‌తో కలిసి కొత్తగూడెం బస్టాండ్‌ను పరిశీలించారు.

బస్టాండ్‌లోని అధ్వాన పరిస్థితులు, వర్షాకాలంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొత్తగూడెం బస్టాండ్ ఆధునికీకరణకు రూ.20 కోట్లు, పాల్వంచ బస్టాండ్ నూతన నిర్మాణానికి రూ.10 కోట్లు అవసరమయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

అదే సమయంలో కొత్తగూడెం బస్టాండ్ నూతన భవన నిర్మాణం కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కూనంనేని ప్రకటించారు. ఆర్టీసీ నిధులను కూడా జోడించి రెండు బస్టాండ్ల అభివృద్ధి పనులను దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు వెల్లడించారు.

టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వేలాది మంది ప్రయాణికులకు మెరుగైన వసతులు అందేలా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కందుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story