Kothagudem: మరణించిన రైతు కుటుంబానికి లక్ష ఇన్సూరెన్స్ అందజేత
Kothagudem: కొత్తగూడెం పీఏసీఎస్ ఆధ్వర్యంలో మరణించిన రైతు కుటుంబానికి రూ.1 లక్ష ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కు అందజేత. పీఏసీఎస్ అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు.
Kothagudem: మరణించిన రైతు కుటుంబానికి లక్ష ఇన్సూరెన్స్ అందజేత
కొత్తగూడెం: ఈ రోజు అనగా 22.07.2026 బుధవారం నాడు కొత్తగూడెం వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో సంఘంలో సభ్యత్వం కలిగి ఉంటూ ఇటీవల మరణించిన చుంచుపల్లి మండలం బాదావత్ తండా నివాసి బాదావత్ చందా s/o సోమ్ల రైతు యొక్క SBI లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం 1 లక్ష రూపాయల మొత్తాన్ని అతని నామినీ అయిన భార్య బాదావత్ పద్మకు కొత్తగూడెం సహకార సంఘ అధ్యక్షులు మండే వీర హనుమంత రావు అందజేశారు.
ఎవరైతే రైతులు సొసైటీలో లోన్ తీసుకుని, 59 సంవత్సరాలలోపు వయసులో రైతు మృతి చెందితే గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా నామినీకి లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుందని, గతంలో ఇట్టి ఇన్సూరెన్స్ పాలసీ 50,000/- మాత్రమే ఉండేది కానీ ప్రస్తుతం ఇన్సూరెన్స్ పాలసీ 1 లక్ష రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి N.V రమణా రెడ్డి, సంఘ డైరెక్టరు K.రామచంద్రా రావు, రైతులు పాల్గొన్నారు.




