Kothagudem: ఎమ్మెల్సీ తాతా మధును తొలగించాలని ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన

Kothagudem: అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పదవి నుంచి తొలగించాలని కొత్తగూడెంలో ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్ చేసింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 8 Sept 2026 4:32 PM IST
Kothagudem
X

Kothagudem: ఎమ్మెల్సీ తాతా మధును తొలగించాలని ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన

కొత్తగూడెం: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఆందోళన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు సురేష్ అజ్మీర ఆధ్వర్యంలో పోస్ట్‌ ఆఫీస్ సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు.

ఈ సందర్భంగా సురేష్ అజ్మీర మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్ధ పదవులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

తాతా మధుపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్ చేసింది. రాజకీయ విభేదాల పేరుతో రాజ్యాంగబద్ధ పదవులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధుకు ఇదే గట్టి హెచ్చరిక అంటూ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు వసీం పాషా, కాటి సందీప్, లావుడియా గౌతమ్, ఉబ్బపల్లి నిఖిల్, షేక్ సమీర్, సాయి, లక్కీ, షేక్ జమీల్, షాహిద్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story