Kothagudem: రాజీ మార్గమే రాజమార్గం - ఘనంగా జాతీయ లోక్ అదాలత్
Kothagudem: కొత్తగూడెంలో నేషనల్ లోక్ అదాలత్ విజయవంతం. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవడం వల్ల కాలం, ధనం ఆదా అవుతాయన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్.
Kothagudem: రాజీ మార్గమే రాజమార్గం - ఘనంగా జాతీయ లోక్ అదాలత్
కొత్తగూడెం: రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు కాలంతో పాటు ధనం కూడా ఆదా అవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ అన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని పేర్కొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం స్థానిక కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం. రాజేందర్ మాట్లాడుతూ.. పరస్పర అంగీకారంతో వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ అద్భుతమైన వేదిక అని తెలిపారు. లోక్ అదాలత్‌లో తీసుకునే నిర్ణయానికి అప్పీల్ అవకాశం ఉండదని, ఇరువర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
రాజీ కుదిరిన కక్షిదారులకు అవార్డు కాపీలను అందజేశారు. లోక్ అదాలత్‌కు హాజరైన కక్షిదారులకు ఎస్బీఐ బ్యాంకు సౌజన్యంతో పులిహోర, మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో బి. రవికుమార్, వి. వినయ్ కుమార్, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. కిరణ్ ముదుల్కర్, నోడల్ ఆఫీసర్ రాఘవయ్య, న్యాయవాదులు, బ్యాంకు ప్రతినిధులు, కక్షిదారులు, ట్రాఫిక్ ఎస్‌ఐ, సిబ్బంది, కోర్టు పీసీలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.




