Kothagudem: మైనర్ బాలికపై దాడి కేసు: కానిస్టేబుల్ వెంకటేష్ అరెస్ట్!

Kothagudem: కొత్తగూడెంలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితులకు ఆశ్రయం కల్పించిన బెటాలియన్ కానిస్టేబుల్ (A-6) వెంకటేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 17 July 2026 5:37 PM IST
Kothagudem
X

Kothagudem: మైనర్ బాలికపై దాడి కేసు: కానిస్టేబుల్ వెంకటేష్ అరెస్ట్!

Kothagudem: కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో A-6 నిందితుడు, బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన కేసు వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.

కేసు వివరాల ప్రకారం.. నిందితుడు మైనర్ బాలికను కొత్తగూడెం పాత డిపో ప్రాంతంలోని ఒక గదికి తీసుకెళ్లిన సమయంలో, ఆ గదిలో నిందితులకు ఆశ్రయం కల్పించిన A-6 బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లి 11.07.2026న కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా A-6 నిందితుడు వెంకటేష్‌ను కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story