Kothagudem: ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
Kothagudem: కొత్తగూడెంలో జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మొక్కలు నాటి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
Kothagudem: ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
కొత్తగూడెం: జనసేన పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు, కార్యకర్తలు కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి, జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. సినీ రంగంలో తన ప్రతిభతో చెరగని ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగపరమైన హక్కులు, రాజకీయ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించారని తెలిపారు. తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శక్తిగా ఎదిగి ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలోనూ అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని నాయకులు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు, వీర మహిళలు, వీర వనితలు తదితరులు పాల్గొన్నారు.




