Yellandu: కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ఐఎఫ్‌టీయూ

Yellandu: ఇల్లందు కోయగూడెం ఓసీ కార్మికుల పెండింగ్ వేతనాలు, ఈపీఎఫ్ జమ చేయాలని సింగరేణి జీఎంకు ఐఎఫ్‌టీయూ వినతిపత్రం. ఆందోళనల హెచ్చరిక.

SHOBAN BABU, YELLANDU
Published on: 4 Aug 2026 7:33 PM IST
Yellandu
X

Yellandu: కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ఐఎఫ్‌టీయూ

ఇల్లందు: కోయగూడెం ఓపెన్ కాస్ట్ ఓబీ పనులు నిర్వహిస్తున్న ఎల్ ఎస్ ఎన్ యాజమాన్యం కార్మికులకు పెండింగ్ లో ఉన్న జూన్,జూలై రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని పెండింగ్లో ఉన్న సుమారు 10 నెలల ఈపీఎఫ్ ను వెంటనే కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కంపెనీ ఇల్లందు జిఎం గారికి ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఐ ఎఫ్ టి యు)రాష్ట్ర అధ్యక్షుడుMD. రాసుద్దిన్,ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు డి. ప్రసాద్ మాట్లాడుతూ ఎల్ ఎస్ ఎన్ యాజమాన్యం కార్మికుల వేతనాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని వహిస్తుందని అనేక మార్లు వినతి పత్రాలు సమర్పించిన చలనం లేదని అన్నారు.

సింగరేణి యాజమాన్యం బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందని ఈపీఎఫ్ కార్మికుల జీతాలు నుండి కోత విధిస్తూ కార్మికుల ఖాతాలో జమ చేయకుండా నిర్లక్ష్యాన్ని వహించడంపై పలు దపాలుగా వినపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన లేదని అన్నారు. ఇప్పటికైనా ఎల్ఎస్ఎన్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకొని పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలు,ఈపిఎఫ్ ను తక్షణమే కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు‌.

లేని యెడల ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు తోడేటి నాగేశ్వరరావు, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు రీజియన్ అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SHOBAN BABU, YELLANDU

SHOBAN BABU, YELLANDU

Next Story