Kothagudem: శ్రీ రామచంద్ర కళాశాలకు యూజీసీ అటానమస్ హోదా.. సంబరాలు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూజీసీ అటానమస్ హోదా దక్కింది. ప్రిన్సిపాల్ అధ్యాపకులు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 30 July 2026 5:52 PM IST
Kothagudem
X

Kothagudem: శ్రీ రామచంద్ర కళాశాలకు యూజీసీ అటానమస్ హోదా.. సంబరాలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..

కొత్తగూడెంలోని.. శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యు జి సి అటానమస్ హోదా..

హర్షం వ్యక్తం చేస్తున్న కళాశాల లెక్చరర్లు విద్యార్థులు..

కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని..

బాణాసంచా కాల్చి సంబరాలు..

శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూజీసీ అటానమస్ హోదా లభించింది..

భారత ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయ మంజూరి సంఘం (UGC) అటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదాను మంజూరు చేసింది.

ఈ హోదా 2026–27 విద్యా సంవత్సరం నుండి 2030–31 విద్యా సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల కాలానికి అమలులో ఉండేలా యూజీసీ ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. పద్మ హర్షం వ్యక్తం చేస్తూ, కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి యోగితా రాణా, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీమతి దేవసేన గార్ల సహకార ఫలితంగానే ఈ గుర్తింపు లభించిందని తెలిపారు..

విద్యార్థులు యు జి సి అటానమస్ లభించడం పట్ల తమ భవిష్యత్తుకు ఎంతో మేలు చేకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు.

రామచంద్ర డిగ్రీ కళాశాలలో లైబ్రరీ సౌకర్యము, కంప్యూటర్స్ ల్యాబ్ ,విశాలమైన గ్రౌండ్ ఉన్నదని, డిగ్రీ కోర్సులతోపాటు

బ్యూటిషియన్, టైలరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story