Kothagudem: కొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష!

Kothagudem: ట్రాఫిక్ పిఎస్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ 2వ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 3 Sept 2026 7:23 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష!

Kothagudem: కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఇద్దరికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన జబ్బా సాగర్ , జాతోత్ సురేష్ వ్యక్తులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ఈ కేసులకు సంబంధించి కొత్తగూడెం 2వ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి రవికుమార్ విచారణ జరిపి, ఇద్దరు నిందితులకు రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్హెచ్ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనదారులతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story