Kothagudem: ఆసుపత్రుల్లో 'ఈ-ఔషధి' అప్‌డేట్ చేయాలి.. డీఎంహెచ్ఓ

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా. తుకారాం రాథోడ్ ప్రోగ్రామ్ మరియు ఫార్మసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 15 Jun 2026 5:49 PM IST
Kothagudem
X

Kothagudem: ఆసుపత్రుల్లో 'ఈ-ఔషధి' అప్‌డేట్ చేయాలి.. డీఎంహెచ్ఓ

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కార్యాలయం నందు ప్రోగ్రామ్ ఆఫీసర్లతో పునఃశ్చరణ కార్యక్రమమును నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పల్స్ పోలియో ఈనెల 28న ఉన్నందున దానికి సంబంధించిన సమావేశాలు శిక్షణ కార్యక్రమాలు అదేవిధంగా మొదటి రోజు బూత్ ఆక్టివిటీ రెండవ రోజు మరియు మూడవ రోజుగృహ సందర్శనలు చేయడం గురించి చర్చించడం జరిగినది.

ఈ నెల 19న వరల్డ్ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా జిల్లాలో సికిల్ సెల్ ఎనీమియా మరియు తలసీమియా, రక్త కణ లోపాలు ఉన్న వారిని గుర్తించి స్క్రీనింగ్ చేయుట మరియు క్యాంపులు నిర్వహించడం గురించి మాట్లాడడం జరిగినది. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది కొరత ఉన్నందున వాటిని అధిగమించడానికి ఒక పటిష్ట ప్రణాళికను తయారు చేయుట గురించి వివరించడం జరిగినది.. డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డా. తుకారాం రాథోడ్ జిల్లా ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిర్వహణ, నిల్వ, పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. గడువు ముగిసిన మందులు (Expired Drugs), వినియోగానికి అనర్హమైన మందుల రికార్డులు, డిస్కార్డ్ చేసిన మందుల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

వ్యాక్సిన్లు మరియు ఫార్మసీ మందుల కోసం ప్రత్యేక స్టాక్ రిజిస్టర్లు నిర్వహించాలని, వేగంగా వినియోగమయ్యే (Fast Moving) మరియు తక్కువగా వినియోగమయ్యే (Slow Moving) మందులపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేపట్టి అవసరమైన మేరకు నిల్వలను నిర్వహించాలని సూచించారు.

రోగనిరోధక టీకాల కార్యక్రమంలో ఉపయోగించే వ్యాక్సిన్లను నిర్దేశిత ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడంతో పాటు కోల్డ్ చైన్ నిర్వహణను కచ్చితంగా పాటించాలని తెలిపారు. వ్యాక్సిన్ల నాణ్యతను కాపాడేందుకు కోల్డ్ చైన్ నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.

అలాగే మందుల కొనుగోలు, స్వీకరణ, పంపిణీ, నిల్వలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఈ-ఔషధి (e-Aushadhi) పోర్టల్ లో సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని అన్ని ఆరోగ్య సంస్థల్లో అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ఫార్మసీ అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్వో కొత్తగూడెం డాక్టర్ సాయి కళ్యాణ్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ప్రతాప్ ,డాక్టర్ దినేష్, డాక్టర్ రాకేష్, డాక్టర్ హరీష్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి ,డిపిఎమ్ఓ మోహన్, సిహెచ్ఓ నాగభూషణం, జిల్లా ఫార్మసీ అధికారులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story