Kothagudem: భారీగా పట్టుబడిన గంజాయి.. ‘పుష్ప’ స్టైల్లో స్మగ్లింగ్!

Kothagudem: పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కంటైనర్‌లో రహస్యంగా తరలిస్తున్న సుమారు రూ.3 కోట్ల విలువైన గంజాయిని సీజ్ చేశారు.

G Ravi, Bhadradri
Published on: 30 Jun 2026 1:37 PM IST
Kothagudem
X

Kothagudem: భారీగా పట్టుబడిన గంజాయి.. ‘పుష్ప’ స్టైల్లో స్మగ్లింగ్!

కొత్తగూడెం: బూర్గంపాడు మండలం సారపాకలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

చత్తీస్‌గఢ్ నుంచి తరలిస్తున్న కంటైనర్‌ను తనిఖీ చేసిన పోలీసులు, అందులో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే గంజాయి ఉన్నట్లు సమాచారం.

"పుష్ప" స్టైల్లో కంటైనర్‌లో రహస్యంగా గంజాయిని తరలించే ప్రయత్నం చేసినట్లు. సారపాక వద్ద అప్రమత్తమైన పోలీసులు కంటైనర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్న ముఠా ఎవరు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story