Kothagudem: కొత్తగూడెం అసౌకర్యాల మధ్య చుంచుపల్లి స్కూల్
Kothagudem: కొత్తగూడెం చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాల కొరత. పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్.
Kothagudem: కొత్తగూడెం అసౌకర్యాల మధ్య చుంచుపల్లి స్కూల్
కొత్తగూడెం: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తెలిపారు. సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను అధ్యయనం చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాలలో నాలుగు వందల మంది విద్యార్థులు ఉంటే విద్యార్థుల సంఖ్య కనుగుణంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవని తెలిపారు. ఇంకా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదని, నూతనంగా ప్రభుత్వం నోట్ పుస్తకాలు కూడా అందజేస్తామని ప్రకటించినప్పటికీ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందలేదని తెలిపారు.
పాఠశాలలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాఠశాలను పర్యవేక్షించే ప్రధానోపాధ్యాయుల పోస్టు ఖాళీగా ఉందని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు సరిగా రావడం లేదని, పాఠశాల ప్రారంభం నుంచి వంట చేసిన బిల్స్ పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు వంట సెట్టు, డార్మెటరీ లేవని అసౌకర్యాల మధ్య పాఠశాల నడుస్తుందని తెలిపారు.
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు పదో తరగతి పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్న ఇలాంటి ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పనకు అవసరమైన నిధులు కేటాయిస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయన్నారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా నిర్మించిన మూత్రశాలలు మరుగుదొడ్లు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని కాంట్రాక్టర్ తో మాట్లాడిన సిపిఎం బృందం..
ప్రభుత్వం మంజూరు చేసిన మూత్రశాలలు మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉండడంతో సిపిఎం నాయకత్వం కాంట్రాక్టర్ ని పాఠశాలకు పిలిపించి మూత్రశాలలు, మరుగుదొడ్లు ఎందుకు ప్రారంభించట్లేదని ప్రశ్నించింది. స్పందించిన కాంట్రాక్టర్ రెండు రోజుల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు ప్రారంభిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ ,టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు నందిపాటి రమేష్ ,నాయకులు నరసింహారావు సతీష్ బాలకృష్ణ రాములు రఘు, వెంకటేశ్వర్లు నసూర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.




