Kothagudem: ఆగస్టు 6 నుండి సీపీఐ 'ప్రజా చైతన్య యాత్రలు' పోస్టర్ల ఆవిష్కరణ!

Kothagudem: కొత్తగూడెంలో సీపీఐ ప్రజా చైతన్య యాత్రల పోస్టర్లు ఆవిష్కరణ. ఆగస్టు 6 నుండి జిల్లా వ్యాప్తంగా యాత్రలు. నిత్యావసరాల ధరలు, ఉద్యోగాల భర్తీపై డిమాండ్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 2 Aug 2026 7:14 PM IST
Kothagudem
X

Kothagudem: ఆగస్టు 6 నుండి సీపీఐ 'ప్రజా చైతన్య యాత్రలు' పోస్టర్ల ఆవిష్కరణ!

కొత్తగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల (ఆగస్టు) 6వ తేదీ నుండి సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 'ప్రజా చైతన్య యాత్రలు' నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు.

భద్రాద్రి జిల్లా కేంద్రమైన..కొత్తగూడెం పట్టణంలోని ..శేషగిరి భవన్లో సీపీఐ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఈ యాత్రలకు సంబంధించిన గోడ పత్రికలను (పోస్టర్లను) నాయకులు ఆవిష్కరించారు.

ప్రజలపై మోయలేని భారం..

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతోందని మండిపడ్డారు. పెరిగిన భారాలను తక్షణమే

విరమించుకోవాలని, ప్రజా సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా నలుమూలల నుండి ప్రారంభమయ్యే ఈ ప్రజా చైతన్య యాత్రల్లో అన్ని మండలాల సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు మరియు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సీపీఐ పార్టీ ప్రధాన

డిమాండ్లు:

ధరల నియంత్రణ: పెరిగిన నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి.

మహిళా రిజర్వేషన్లు:

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను కాలయాపన చేయకుండా తక్షణమే అమలు చేయాలి. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు..విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి.

హక్కుల పరిరక్షణ: దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న దాడులను, అక్రమాలను అరికట్టాలి.

పేదల సంక్షేమం: అర్హులైన పేద లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మరియు ఇంటి స్థలాలు మంజూరు చేయాలి.

కార్మిక సంక్షేమం: కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి, పర్మినెంట్ చేయాలి. కనీస వేతనాలు చెల్లించడంతో పాటు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకురావాలి.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు.. సలిగంటి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు.. కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్ రావు, జిల్లా సమితి సభ్యులు.. వంగ వెంకట్, రమణ మూర్తి, భూక్యా శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

వీరితో పాటు 1, 2, 3 పట్టణ కార్యదర్శులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, మర్రి గోపి, ఎండి యూసఫ్, పట్టణ సహాయ సహాయ కార్యదర్శులు మాచర్ల శ్రీనివాస్, మండల రాజు, బోయిన విజయ్, పోలోజు సత్యనారాయణ చారి తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story